31-08-2025 12:00:00 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెసేనని, ప్రత్యేక జీవో ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మ హేశ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీ వర్గాలకు ద మాషా ప్రకారం రిజర్వేషన్లు అం దించాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బీ సీలకు రాజ్యాధికారం అందించాలన్న రాహుల్ గాంధీ మహోన్నత ఆలోచనకు కార్యారూ పం తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ బీసీ సమాజం రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు.