27 July, 2026 | 2:50 AM

టీవీ 2కె 26 ఓపెన్ మైక్ విజయవంతం

27-07-2026 02:12 AM

హైదరాబాద్, జులై 26 (విజయక్రాంతి): యువత తమ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరచడం ద్వారా సమాజంలో మార్పునకు దోహదం చేసినవారవుతారని ఇబ్రహీంపట్నం సిద్ధార్థ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్‌ఐఇటీ), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టీఎఎస్‌కే), నోవేషన్ లెర్నింగ్స్, ఇన్స్‌ట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ తెలంగాణ 2కె 26 ఓపెన్ మైక్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఈవో, నోవేషనల్ లెర్నింగ్ ఎన్ స్వాతి రుషీత అన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న సెమినార్‌ను అభినందించారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ పీ శేఖర్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డైరెక్టర్ జీ భగత్, సెక్రెటరీ డాక్టర్ డీ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ  మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తామని, కళాశాలల్లో ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సమన్వయకర్త డాక్టర్ కందే శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువతలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడం, ఆలోచనలకు వేదిక కల్పించడమే  కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు.