calender_icon.png 2 November, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు

02-11-2025 01:32:04 AM

  1. ప్రవేశపెట్టేంత వరకు పోరాటం ఆగదు
  2. రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితో సహకరించాలి
  3. తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితో సహకరించాలని కోరారు.

టీజీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పలు బీసీ కుల సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో బీసీ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు డా.గటిక విజయ్ కుమార్ తో కలిసి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల బీసీ రిజర్వేషన్ల అమలుకై నిర్వహించిన బీసీ రాష్ట్ర బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు బేషరతుగా మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.

గత 76 ఏండ్లుగా పార్టీలు, ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యం చేశాయని, ఇక మీదట బీసీలకు న్యాయబద్ధమైన వాటా ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు ఐక్యమత్యంతో ముందుకు వచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. బీసీ జేఏసీని బలోపేతం చేయడంలో అన్ని బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల అధ్యక్షులను జేఏసీలో కన్వీనర్లుగా నియమించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లా లు, నియోజకవర్గాల్లో బీసీ జేఏసీని ఏర్పా టు చేయాలని సూచించారు.

అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్, ఆరెకటిక సం ఘం అధ్యక్షుడు సురేందర్, దాసరి సంఘం ప్రధాన కార్యదర్శి కె. శివకృష్ణ, జాతీయ బీసీ సంక్షేమ సం ఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, పలు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థి దీక్షను విజయవంతం చేద్దాం..

42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకై ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కళాశాల ఆవరణంలో బిసి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీ నుండి 8 వరకు ఏర్పాటు చేసిన విద్యార్థి దీక్షకు మద్దతుగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృ ష్ణయ్య, నారగోని, బిసి జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం మాట్లాడారు.

బీసీ  విద్యార్తి జేఏసీ లోగోను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు న్యాయ మైన డిమాండ్ అని అన్నారు. నవంబర్ 4 నుండి నవంబర్ 8 వరకు జరుగు దీక్ష వివరాలను వెల్లడించారు. 4న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయ్ పూలే మార్గ దీక్ష, 5 న సాహు మహరాజ్, డాûûబి.ఆర్ అంబెడ్కర్ ఆశయ దీక్ష, 6న సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ సమర దీక్ష, 7న బిపి మండల్, కర్పూరి ఠాకూర్ కార్య దీక్ష, 8న చిట్యాల ఐలమ్మ, సంఘం  లక్ష్మీభాయి ఐక్యత దీక్షలు ఉంటాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్స్ కొమ్మనవెన సైదులు, గౌరవ అధ్యక్షుడు రాజేష్ , బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ అధికార ప్రతినిధి నూకల మధుయాదవ్, రాజు నేత, లింగం యాదవ్, వంశీ, వాసు యాదవ్, సంతోష్, ప్రణయ్, కాసిం, అంజి యాదవ్  తదితరులు పాల్గొన్నారు.