29 July, 2026 | 12:49 AM

గరిడేపల్లిలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక

29-07-2026 12:00 AM

గరిడేపల్లి, జూలై 28 :గరిడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. 202526 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలో మొత్తం 693 ఉపాధి హామీ పనులు చేపట్టగా, వాటికి వేతనాల కింద రూ.6,61,20,215, మెటీరియల్ కింద రూ.34,61,275 వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం రూ.6,95,81,490 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం జూలై 17 నుంచి 27 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించింది. అనంతరం మంగళవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించి తనిఖీ వివరాలను ప్రజల ముందుంచారు. ఉపాధి హామీ పనులు పూర్తి పారదర్శకతతో అమలు చేయాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

ప్రజావేదికలో భాగంగా గడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై స్పందించలేదు. సామాజిక తనిఖీలో ఎలాంటి ఆర్థిక అక్రమాలు లేదా నిధుల దుర్వినియోగం గుర్తించలేదని, సాధారణ సాంకేతిక లోపాలను మాత్రమే గుర్తించి వాటిని సరిదిద్దాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, మండల పంచాయతీ అధికారి ఇబ్రహీం, ఏపీడీ యామిని, అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ ఆశారాణి, జేఎక్యూసీ రామకృష్ణ, అంబుడ్స్మెన్ లచ్చిరాం, ఎస్‌ఆర్పీ తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ, ఏపీవో సురేష్, ఈసీ సుజాత, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.