రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్
కోదాడ జూలై 28 రైతులు ఆరుతడి పం టలు సాగుచేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అన్నారు. మంగళవారం కోదాడ మండలంలోని అ ల్వాలపురం గ్రామంలో నిర్వహించిన మండ ల స్థాయి సర్పంచులు, అధికారుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వర్షా భావ పరిస్థితుల వలన ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలను రైతులు సాగు చేసుకొని లబ్ది పొందాలని కోరారు. విత్తనాలను ఆవిష్కరించారు.
ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీసుకొని భూగర్భ జలాలను పెంచుకోవాలని తెలిపారు. ఇట్టి కార్య క్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్,ఎమ్మార్వో సంతోష్ కిరణ్, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు ,కోదాడ మున్సిపల్ చైర్మన్ కుసుమ బాబు , వైస్ చైర్మన్ మల్లేశ్వరి ఎంపీఓ రాం బాబు, ఏవో రజని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్సకాని శరబేశ్వరరావు కోదాడ మండలం సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కొత్త గురవయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.






