20-08-2025 02:07:24 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవడానికి తాను సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇస్తాడో లేదోనని, ఆయనకు తన మొఖం చూడడం ఇష్టం ఉందో లేదోనని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులు, పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 90 రోజుల్లో రాష్ట్రపతి ఆ బిల్లులను క్లియర్ చేయాల్సి ఉం టుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందు కు వెళ్లుతారని మీడియా ప్రశ్నంచగా పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ (పీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామ న్నారు.
బీసీలకు 42 శాతం కల్పించేందుకు రాజకీయ పార్టీలన్ని ముందుకు రావాలని సీఎం కోరారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని రా జ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని, ఆ ఎంపికలో తన సూచనలు, నిర్ణయం కానీ లేవన్నారు. సుదర్శన్‌రెడ్డి మన ఊరు వ్యక్తి కాబట్టి ఆయన్ను రెగ్యులర్‌గా కలుస్తానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ ఇన్స్‌రెన్సు అంశాన్ని సాధ్య మైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రత్యేక పాలసీ, సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేద్దామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.