20-08-2025 02:06:02 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
కృత్రిమ మేధస్సు రాకతో ఫొటోగ్రాఫర్లకు బాధ్యత పెరిగింది
రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్‌రెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఫోటోలు సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, దానికి మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన 23వ రాష్ట్రస్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ ను బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈ ఫోటో కాంటె స్ట్‌లో ప్రతిభ కనబరిచిన ఫోటో గ్రాఫర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టులం దరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో చేసిన పోరాటాలకు సంబందించిన చిత్రాలను చూస్తున్నప్పుడు గతాన్ని గుర్తు చేస్తుంటాయని, అవే మన జ్ఞాపకాలని అన్నా రు.
ఫొటోగ్రఫీ అభిరుచి అందరికీ రాదని, మంచి నైపుణ్యం ఉండాలన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే కళాత్మకత, క్షణాల్లో ఆలోచించే నైపుణ్యంతో కెమెరాలో బంధించే చిత్రం చిర స్థాయిగా మిగులుతాయ న్నారు. 1995 నుండి 30 సంవత్సరాలుగా ఉన్న తాను ఉద్యమంలో పాల్గొన్న చిత్రాలను ఫైల్ చేసుకుని ఆస్మృతులను సమీకరించుకుంటానన్నారు.
ఫోటోగ్రాఫర్ ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, సమస్యలను మీడియా అకాడ మీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతామన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు రాకతో ఫొటో గ్రాఫర్లకు మరింత భాద్యత పెరిగిందని, తమ నైపుణ్యాన్ని మరింత మెరుగు పర్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్న లిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి, రామ్మూర్తి, వసంత్, సుమన్, జేమ్స్, గడసంతల శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.