calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైని విడవని వాన

20-08-2025 02:06:23 AM

-ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

-జనజీవనం అస్తవ్యస్తం

-విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

-నీట మునిగిన రైలు పట్టాలు.. లోకల్ ట్రైన్లు రద్దు

-రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబై, ఆగస్టు 19 :  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కరోజులోనే దాదాపు ౩౦ సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ముంబైలోని పలు రహదారులపై వరద నీరు పారుతున్నది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు త్రీవ ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విమాన సర్వీసులకు తీ వ్ర అంతరాయం ఏర్పడింది.

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానశ్రయంలో సుమారు 250కి పైగా విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడింది. ప్రయాణికులకు ఇండిగో అలర్డులు అధికారులు జారీ చేశారు. విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.  విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. కాగా వర్ష బీభత్సం కారణంగా ఇప్ప టికే పలు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే ప్రైవేటు ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోమ్ చేసుకోవాలని సర్కార్ సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ముంబయి ము న్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సూచించింది. అలాగే రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు బస్సులను కూడా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించారు. రైలు పట్టాలు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. చెంబూర్ భక్తిపార్క్ మధ్య వెళ్తున్న మోనోరైల్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో మధ్యలో నిలిచిపోయింది. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి ౫౮౨ మందిని జాగ్రత్తగా ట్రైయిన్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

అప్రమత్తంగా ఉండాలి: ఐఎండీ

భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వా తావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గత 24 గం టల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొన్నది.

రెడ్ అలర్ట్

రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అ లర్ట్ ప్రకటించింది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కు రుస్తాయని ప్రజలంతా అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించింది. ముంబ యి, రాయగఢ్, పూణేఘాట్, సతారాఘాట్, రత్నగిరి, కొల్లాపూర్ ఘాట్ లకు 24 గంటల్లో 204.5 మి.మీ మిం చి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీం తో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముంద స్తు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపడుతున్నారు.  సహాయక చర్యల కోసం ఎన్ డీఆర్‌ఎఫ్(జాతీయ విపత్తు ప్రతి స్పం దన దళం) బృందాన్ని మోహరించారు.