calender_icon.png 20 August, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మిస్ యూనివర్స్’ ఇండియాగా మణిక విశ్వకర్మ

20-08-2025 02:04:24 AM

-74వ మిస్ యూనివర్స్  టైటిల్ కైవసం

-థాయ్‌లాండ్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు

-భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న మణిక

-గతేడాది ఆమె మిస్ యూనివర్స్ రాజస్థాన్‌గా ఎంపిక

-మొదటి రన్నర్ అప్‌గా యూపీకి చెందిన తాన్య 

జైపూర్, ఆగస్టు 19(విజయక్రాంతి): ‘మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. జైపూర్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణిక విజేతగా నిలిచారు. తన అందం, తెలివితేటలు, ప్రతిభతో న్యాయమూర్తులను మెప్పించి టైటిల్‌ను గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సిం ఘా చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. భారతదేశం తరఫున మిస్ యూ నివర్స్ పోటీలలో మణిక ప్రాతినిధ్యం వహించనుంది. పోటీలలో మొదటి రన్నర్‌అప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్య నిలిచారు. రెండో రన్నరప్‌గా మెహక్ ధింగ్రా, మూడో రన్నరప్‌గా హర్యానాకు చెందిన అమిషి కౌషిక్ ఎంపికయ్యారు. 

మణిక వ్యక్తిగత వివరాలు 

రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన మణిక విశ్వకర్మ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. గత ఏడాది ‘మిస్ యూనివర్స్ రాజస్థాన్ టైటిల్‌ను మనిక గెలుచు కున్నారు. అమె బహుముఖ ప్రజ్ఞాశాలి కూ డా. ఆమె బిమ్స్‌టెక్ సమావేశంలో భారత్ విదేశాంగ శాఖ తరఫున ప్రాతినిధ్యం వహించారు.ఆమె గొప్ప పబ్లిక్ స్పీకర్, ఫర్మారర్. లలిత్ కళా అకాడెమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి సత్కారాలను పొందారు. ఎన్‌సీసీ క్యాడెట్ అయిన మనిక అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్, జాతీయస్థాయిలో ఎన్నో ప్రద ర్శనలు ఇచ్చారు. ఆమె మంచి చిత్రకారిణి కూడా. ఆమె ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఏడీహెచ్‌డీ వంటి మానసిక స్థితిని బలహీనతగా కాకుండా, ఒక ప్రత్యేకమైన ఆలోచనా శక్తిగా చూడాలని ఆమె నమ్ముతారు. 

అట్టహాసంగా వేడుకలు

జైపూర్‌లో అట్టహాసంగా మిస్ యూనివర్స్ అందాల పోటీలను నిర్వహిం చారు. గ్లామనంద్ గ్రూప్, కే సెరా సెరా బాక్స్ ఆఫీసు సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. ఈనెల 18న రాత్రి గ్రాండ్ ఫైనల్ వేడుకలు నిర్వహించారు. ఈ పోటీలలో అందరిని అధిగమించి తన అందం, తెలివితేటలతో పోటీలలో అద్భుతమైన నైపుణ్యాలను మనిక ప్రదర్శించారు. తన ఆత్మవి శ్వాసం, చాతుర్యం, వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా నిలిచారు. పోటీలలో ఆమె అన్ని విభాగాలలో ఆత్యుత్తమ నైపుణ్యం కనబరిచి ‘మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను మనిక విశ్వకర్మ గెలుచుకున్నారు. నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్(విశ్వసుందరి) పోటీలలోభారత్ తరఫున పోటీ పడతారు. వరుసగా రెండో ఏడాది కూడా ఈ పోటీలు రాజస్థాన్‌లోనే జరిగాయి.ఈ విజయంతో దేశ ప్రజల దృష్టి ఆమెపై పడింది. 

ఎదుగుదల విరామం కోసం వేచి చూడదు

‘నేను మిస్ యూనివర్స్ రాజస్థాన్ కిరీటాన్ని నా వారసురాలికి అప్పగించిన రోజే.. మిస్ యూనివర్స్ ఇండియాఫైనల్ ఆడిషన్స్ స్టేజీపై అడుగుపెటాను. ఒక అధ్యాయాన్ని ముగించి, అదేరోజు మరొక అధ్యాయాన్ని ప్రారంభించడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సుందరమైన కలయిక, ఎదుగుదల ఎప్పుడూ ఒక విరామ కోసం వేచి ఉండదని ఇది గుర్తు చేస్తుంది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో మనిక తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘నా ప్రయాణం గంగానగర్ నుంచి ప్రారంభమై అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి పోటీలకు సిద్ధమయ్యాను. మనపై మనం నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధ్యమంతుంది. నా విజయం వెనక ఎంతో మంది ఉన్నారు. నాకు సాయం చేస్తూ నన్ను ప్రోత్సహించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అని మనికా చెప్పారు.