calender_icon.png 17 October, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలి

17-10-2025 12:53:08 AM

-మోదీపై ఒత్తిడి పెంచేందుకు ‘ఛలో ఢిల్లీ’ చేపట్టాలి 

-పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్

-బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి 

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం ఇచ్చాకనే ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు అన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీసీ సంఘాలు ఈ నెల 18 ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాల ని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల సా ధనకు ఇదే అనువైన సమయమని, అంద రం ఢిల్లీకి వెళ్లి మోదీపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా దక్కాలని రాహుల్‌గాంధీ ఇచ్చి న నినాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణ యం తీసుకున్నారని వీహెచ్ గుర్తు చేశారు.  కోర్టులు అభ్యంతరం చెప్పడంతో సీఎం రే వంత్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి అన్ని పా ర్టీలతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్రమోదీ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు వెనుకడగు వేస్తున్నారని వీహెచ్ నిలదీశారు. ట్రిపుల్ తలాఖ్, 370 ఆర్టికల్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్న మోదీ.. బీసీల రి జర్వేషన్ల విషయంలోనూ న్యాయం చేయాలన్నారు. అంతకు ముందు సికింద్రాబాద్, హైదరాబాద్, పాతబస్తీకి చెందిన పలువురు వ్యాపారులను కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు.