17-10-2025 12:51:51 AM
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): గత పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ చేసిన బాకీలకు ప్రజలు గుణపా ఠం చెప్పి పక్కన పెట్టారని, అయినా బుద్ధి మార్చుకోకుండా మళ్లీ బాకీ కార్డు పేరుతో బిఆర్‌ఎస్ కొత్త నాటకాలు ఆడుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలోమీడియాతో మాట్లాడిన రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌బీఆర్‌ఎస్పు తీవ్ర విమర్శలు గుప్పించారు.పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్ పా ర్టీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని సైతం పూర్తిగా అమలు చేయలేక పోయిందన్నారు. ఇప్పుడు ‘బాకీ కార్డు’ పేరు తో ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటని మంత్రి ధ్వజమెత్తారు.
పదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు బహిరంగ చర్చకు రావాలని,తేదీ, సమయం వారే చెబితే తాము సిద్ధమే అని అడ్లూరి సవాల్ విసిరారు. ప్రజల కష్టంతో నిండిన రాష్ట్రా న్ని అప్పుల బాట పట్టించి,ఇప్పుడు ప్రజలే మోసపోయినట్లు నటించడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధికి కాకుండా ప్రచారానికే ప్రభుత్వ ఖజాన నుండి కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు.
ప్రజల పన్నులతో కేటీఆర్ బిఆర్‌ఎస్ పార్టీని నడిపారని,ఇప్పుడు రుణాల ఊబి లోకి నెట్టిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుందన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇరవై నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తోందన్నారు.ప్రజల విశ్వాసమే మా బలం అని,ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని మంత్రి తెలిపారు.
ధర్మపురి అభివృద్ధి లో వేగం పెరిగిందని,డిగ్రీ కళాశాల జీఓ త్వరలో వస్తుందన్నా రు.గోదావరిలో మురుగునీరు కలవకుండా రూ.17 కోట్లతోసీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోందన్నారు. ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిలిచిపోయిన రోళ్ళ వాగు అభివృద్ధి పనులు ప్రారంభించేందు కుత్వరలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో సమీక్ష నిర్వహించనున్నామన్నారు.
ధర్మపురిలో బస్డిపో, పాలిటెక్నిక్ కళాశాలలు త్వరలో ఏర్పాటు కానున్నాయని,నేరెళ్ల వద్ద రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కళాశాల నిర్మాణానికిడిప్యూటీ సీఎం చేతులమీదుగా భూమిపూజ జరగనుందన్నా రు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బిల్లులను పరిష్కరించేందుకు ఎస్సీఎస్టీ శాఖలకు అత్యవసర నిధుల కింద రూ.60 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.