21-12-2025 06:02:00 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ ఆన్ సండే అనే ప్రోగ్రాం ని డివైఎస్ఓ సురేష్ ఆదేశాల మేరకు ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కేలో ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మంది విద్యార్థులు 3 కే సైకిలింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ అమీరీశెట్టి తిరుపతి , సుల్తానాబాద్ మండల్ ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ ప్రణయ్ , ఖేలో ఇండియా కోచ్ గెల్లు మధుకర్ , పిడి వెంకటేష్ , వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కొమురవెల్లి భాస్కర్,మంద శ్రీనివాస్ లు పాల్గొన్నారు...