21-12-2025 05:48:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి నిర్మల్ డిపో నుండి ఆదివారం బస్సు నడిపించినట్టు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి కామిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, నుండి శబరిమల వెళ్తుందని రిటర్న్ లో రామేశ్వరం నుండి నిర్మల్ వస్తుందని ఆయన తెలిపారు. ఈ యాత్రలో వెళ్తున్న భక్తులకు శుభాభివందనాలు తెలిపారు.
అదే విధంగా ఈ నెల 24 వ తేదీ రోజు పండరిపూర్,తెలజాభవాని ప్రత్యేక బస్సు నడుపుచున్నట్లు ఆయన తెలిపారు ఛార్జి 2250/- ఉంటుందని ప్రయానికులు ఆన్ లైన్ లో గాని నిర్మల్ బస్టాండ్ లో గాని టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాలకు 9959226003,7382842582 లో సంప్రదించాలని ఆయన కోరారు.