21-12-2025 05:31:12 PM
దాత్రు హృదయం కలిగిన వారు ధన్యులు
కడం, ఖానాపూర్, పాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాస్టర్ ప్రశాంత్, రాజబాబు,
ఖానాపూర్,(విజయక్రాంతి): రానున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చర్చిలలో ఆదివారం బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు దాస్ రెడ్డిమల్ల చిత్ర మిషన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ ఫౌండర్ చైర్మన్ నేత్ర వైద్య సహాయకులు చిత్రలత రెడ్డిమల్ల లు కొన్ని చర్చిలలో చీరలు, బట్టలు అందించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ కడెం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పాస్టర్ ప్రశాంత్ రాజబాబులు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ దాత్రులు హృదయం కలిగి ఉండాలని
అప్పుడే భూమి మీద బీదరికాన్ని జయించగలమని, పరలోకం విడిచి మానవమాత్రుడిగా ఈ భూమి మీద జన్మించిన యేసు క్రీస్తు వలె ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలని, భూమి మీద ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభములు కలగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సుర్జాపూర్ గ్రామం జీసస్ మిరాకిల్ చర్చ్ పాస్టర్ ఏసుదాస్, సత్తెనపల్లి గ్రామ ఎఫ్ ఐ జి సి చర్చ్ పాస్టర్ అహరోన్, గాంధీనగర్ చర్చ్ పాస్టర్ రవి ,పలువురు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.