21-12-2025 05:33:10 PM
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రామాంజనేయులు ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆది వారం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. జిల్లాలో సుమారు 423 మంది రేషన్ డీలర్లు ఉన్నారని, ఎవరికైనా ఆపద వస్తే వారి కుటుంబానికి ఖచ్చితంగా సంఘం తరపున అండగా ఉండి ఆర్థిక సహాయం అందజేస్తామని మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోట పలుకుల సత్తయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆసాది సుధాకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, మంచిర్యాల మండల అధ్యక్షుడు మహేందర్, దండేపల్లి మండల అధ్యక్షుడు మల్లేష్, డీలర్లు సలీం, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.