calender_icon.png 21 December, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం

21-12-2025 05:58:37 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో గల మైత్రి యోగా & నేచర్ క్యూర్ సెంటర్ లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులు డాక్టర్ కె.ఎన్. సుకుమార్, డాక్టర్ సమీరా రెడ్డిలు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, రోజువారీ జీవితంలో యోగా ప్రముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం పొందవచ్చు.

అంతే కాకుండా రక్తపోటు, మధుమేహం, మైగ్రేన్, హార్మోనల్ సమస్యలు, మానసిక సమస్యలు వంటి అనేక ఒత్తిడిలు, జీవనశైలి వ్యాధులను నివారించవచ్చన్నారు. నిత్య ధ్యానం వల్ల మనసుకు స్పష్టత, శాంతి లభిస్తుందని, చిన్న వయసు నుంచే, కిశోర దశలో, మధ్య వయస్సులో, వృద్ధాప్యంలో కూడా తప్పకుండా అభ్యసించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ త్రినాథ్ రావు, పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.