21-12-2025 06:19:54 PM
హైదరాబాద్: బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రం, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రముఖులకు తేనీటి విందుతో ఆతిథ్యమిచ్చారు. రాష్ట్రపతి ప్రతి ఏటా శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చే ఆనవాయితీ ఉంది. వేసవి కాలం విడిది కోసం సిమ్లా వెళ్తుంటారు.