calender_icon.png 6 February, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు టైటిల్ పెట్టనందుకు క్షమించండి!

06-02-2026 02:18:54 AM

భూమిక ప్రధాన పాత్రలో నటించగా సారా అర్జున్, నాజర్, రోహి త్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. “నేను ప్రేక్షకుల దేవుళ్ల సమయానికి, డబ్బుకు, విజ్ఞతకు విలువ ఇస్తా. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తెరకెక్కించా. వారి డబ్బు, సమయాన్ని వృథా చేయను.

ప్రేక్షకుల విజ్ఞతకి పెద్దపీట వేసేలా ఈ చిత్రాన్ని రూపొందించా. అడాల్సెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్ అనే అంశాలతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. నా మేధస్సుని ఉపయోగించి కాకుండా ఓ సాధారణ వ్యక్తిలా సమాజాన్ని చూసిన వ్యక్తిగా ఈ సిని మా తీశా. తెలుగు టైటిల్ పెట్టనందుకు నన్ను క్షమించండి. సినిమా చూసిన తర్వాత ‘యుఫోరియా’టైటిల్ కరెక్ట్‌గా సెట్ అయిందని అంటారంతా. సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లుకున్నా. మేం కుటుంబ సమేతంగా ఈ సినిమా నిర్మించాం.

యూ త్, పేరెంట్స్ అందరూ వీక్షిస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు. భూమిక మాట్లాడుతూ.. “యుఫోరియా’ లాంటి చిత్రాలను చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి చిత్రాల్లో రిస్క్ ఎంతో ఉంటుంది. గుణశేఖర్, ఆయన ఫ్యామిలీ రిస్క్ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయా. రాత్రంతా ఈ సినిమా నన్ను వెంటాడుతూ నే ఉంది” అన్నారు. నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. “యుఫోరి యా’ అనేది సందేశాత్మక చిత్రమేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ మూవీని చూసిన వారంతా కూడా కొత్త కథకు కమర్షియల్ అంశాల్ని జోడించి కొత్తగా తీశారని మెచ్చుకున్నారు. భూమిక కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా ‘యుఫోరియా’ నిలుస్తుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు లిఖిత, విఘ్నేశ్, పృథ్వీరాజ్, మరికొందరు చిత్రబృందం కూడా మాట్లాడారు.