06-02-2026 02:17:03 AM
తొలితరం తెలుగు కథానాయిక కృష్ణవేణి జీవిత విశేషాలతో రూపొందిన కొత్త పుస్తకం ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి’. ఈ పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ ముఖ్యఅతిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఎన్టీ రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చిన పలు పరిశోధనా గ్రంథాల రచయిత, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ డాక్టరేటుకు అర్హుడని పేర్కొన్నారు. పుస్తక రచయిత భగీరథ మాట్లాడుతూ.. మహానటి కృష్ణవేణమ్మ జీవితం ఈ తరం వారందరికీ స్ఫూర్తిదా యకమని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, మాగంటి మురళీమోహన్, పర్వతనేని రాంబాబు తదితర సినీ, సాహిత్య రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.