calender_icon.png 6 February, 2026 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డూప్ లేకుండా..

06-02-2026 02:19:34 AM

జాజిరే జాజికాయ.. అంటూ హుషారెత్తించే పాటల్లో తన సహజమైన అందాల విందును పంచింది స్టార్ బ్యూటీ సంయుక్త మీనన్. ఇప్పుడు పోరాట సన్నివేశాల్లోనూ ఆ సహజత్వం ఉట్టిపడేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగింది. ఆమె తొలిసారి నటిస్తున్న మహిళా ప్రాధాన్య చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. దర్శకుడు యోగేశ్ కేఎంసీ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ నిర్మిస్తున్నాయి.

రాజేశ్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మురళీశర్మ, రావు రమేశ్, నాజర్, మనీష్ వాధ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమా కోసం సంయుక్త పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది. డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తోంది.

ఈ స్టంట్స్‌లో అవుతున్న గాయాలను సైతం పట్టించుకోకుండా షూటింగ్ చేస్తుండటం విశేషం. ఇందులో సంయుక్త చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌గా నిలవనున్నాయని టీమ్ పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదల కానుంది.