మెడికవర్‌లో ఒబేసిటీ క్లినిక్
సికింద్రాబాద్‌లో ప్రారంభించిన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ఊబకాయం కారణంగా పెరుగుతు న్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్‌లో సోమవారం ప్రత్యేక ఓబిసిటీ క్లినిక్‌ను ఏర్పా టు చేయగా.. హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వేగంగా పెరుగుతోందని, దీని వల్ల మధుమేహం, రక్తపో టు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ప్రజలు ప్రారంభ దశలోనే వైద్యుల సలహా తీసుకుని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఊబకాయాన్ని నియంత్రించవచ్చన్నారు. డా. పవన్ అడ్డాల, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ప్రోగ్రామ్ హెడ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుతూ.. ఊబకాయం కేవలం శరీర బరువు పెరగడం మాత్రమే కాదు ఇది ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సమస్యలకు కూడా కారణమవుతుంది.
సరైన వైద్య పర్యవేక్షణతో పాటు అవసరమైనప్పుడు బారియాట్రిక్ సర్జరీ ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం అందించవచ్చు అన్నారు. డా. మాధవి వెర్పుల, సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ మాట్లాడుతూ, ఊబకాయం శరీరం లోని హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి టైప్-2 డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, స్లీప్ అప్నియా వంటి అనేక సమ స్యలకు దారితీస్తుందన్నారు.
కార్యక్రమంలో మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డా. కృష్ణ గోపాల్ భండారి, డా. సంతోష్ ఎం. నారాయణకర్, డా. అజయ్ శేషేరావ్ షిండే, డీఎంహెచ్‌వో డా. వెంకటి, రీజనల్ డైరెక్టర్ డా. జానకి రామ్, సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రశాంత్ పాల్గొన్నారు.




