17 March, 2026 | 1:49 AM

అమెరికాలో వరంగల్ వాసి మృతి

17-03-2026 12:34 AM

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరణం

మహబూబాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆదివారం అమెరికాలో గుండెపోటుతో మృతిచెందారు. రాకేశ్ గత పదేండ్లుగా అమెరికాలోని వర్జీనియాలో ఉంటూ, ఉద్యోగం చేస్తున్నారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

వారం వ్యవధిలోనే ముగ్గురు మృతి 

వారం రోజుల వ్యవధిలో వరంగల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అమెరికాలో మరణించారు. ఈ నెల 10న నగరానికి చెందిన కొత్త శ్వేత గుండెపోటుతో మరణించగా, 13న నగరంలోని దేశాయిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చిదురాల విజయరాణి కూడా గుండెపోటుతో మరణిం చారు. ఆదివారం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాడిపత్రి రాకేష్ కూడా గుండెపోటుతోనే మర ణించడం విషాదం.