కొత్త ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్
- కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
- ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర పదవీ విరమణ నేపథ్యంలోనే నియామకం
- 30న సేథ్ బాధ్యతల స్వీకరణ
- ౪౦ ఏళ్ల అనుభవం.. ఆయన నేతృత్వంలో ఎన్నో ఆపరేషన్లు సక్సెస్
- సైన్యాన్ని ఆధునిక సాంకేతికత వైపు మళ్లించిన అధికారుల్లో ఈయన ఒకరు
న్యూఢిల్లీ, జూన్ 13: భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. శనివారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యంలో వైస్ చీఫ్ గా సేవలందిస్తున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నూ తన చీఫ్ ఎంపిక జరిగింది. సేథ్ ఈనెల 30న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనునున్నారు.
ధీరజ్ సేథ్ సైన్యంలో అత్యంత సీనియర్ ఆఫీసర్లలో ఒకరిగా గుర్తింపు పొం దారు. సేథ్ ఆర్మ్‌డ్ కోర్ విభాగానికి చెందిన అధికారి. భారత సైన్యంలో ఆర్మ్‌డ్ కోర్ విభాగం నుంచి ఒక అధికారి ఆర్మీ చీఫ్ కావ డం 1997 తర్వాత ఇదే తొలిసారి. కిత్రం సారి జనరల్ శంకర్ రాయ్ చౌదరి ఆ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అదే విభాగం నుంచి ధీరజ్ సేథ్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు అందుకోబోతున్నారు. సేథ్ భారత సైన్యంలో దాదా పు నాలుగు దశాబ్దాలుగా సైన్యానికి సేవలందిస్తూ వస్తున్నారు.
ఆయన స్వస్థలం ఉత్తరప్ర దేశ్‌లోని ప్రయాగ్‌రాజ్. సేథ్ ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యు యేషన్ పూర్తి చేశారు. 1986 డిసెంబర్‌లో సైన్యంలో చేరారు. ఆర్మ్‌డ్ కోర్‌లో అధికారిగా ప్రయాణం ప్రారంభించారు. తన 40 ఏళ్ల ప్రస్థానంలో అనేక క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేశారు. ఎన్నో కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. థార్ ఎడారి ప్రాంతంలోని ఆర్మ్‌డ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు.
పాకిస్థాన్ సరిహద్దుల్లో వ్యూహాత్మక 98 ఆర్మ్‌డ్ బ్రిగేడ్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా ఆయన జమ్మూ కశ్మీర్ వేదికగా నిఫాం ఫోర్స్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి సాధించారు.
భోపాల్ కేం ద్రంగా పనిచేసే 21 స్ర్టైక్ కోర్ (సుదర్శన్ చక్ర కోర్) కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత జైపూర్ కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ కమాండ్, పుణె కేంద్రంగా ఉన్న సదరన్ కమాండ్లకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. పాకిస్థాన్ సరిహద్దులను పర్యవేక్షించే ఈ రెండు కీలక ఆపరేష నల్ కమాండ్స్‌కు సారథ్యం వహించిన అరుదైన ఘనత ఆయన సొంతం. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉంటూ 2023లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు నాయకత్వం వహించారు.
సైనిక కుటుంబ నేపథ్యం
ధీరజ్ సేథ్ కుటుంబానికీ సైన్యానికి విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి లెఫ్టినెంట్ జనరల్ కృష్ణమోహన్ సేథ్ కూడా సైన్యంలో పనిచేశారు. ఒక సాధారణ సైనికుడిగా ప్రయాణం ప్రారంభించి, అడ్జటెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. ఆయ న సేవలను గుర్తించిన భారత ప్రభు త్వం పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించింది. ఈక్రమంలో ఆయన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు.
తండ్రీ కొడుకులు ఇద్దరూ సైన్యంలో ప్రతిష్ఠాత్మకమైన సుదర్శన్ చక్ర కోర్స్‌కు క మాండర్లుగా వ్యవహరించడం మరో విశే షం. ధీరజ్ సేథ్ సోదరుడు రవ్నీష్ సేథ్ కూడా కార్వార్‌లో రియర్ అడ్మిరల్‌గా సేవలందిస్తున్నారు. ధీరజ్ సేథ్ ఖడక్వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ పొందారు. 1986 డిసెంబర్‌లో ఆర్మ్‌డ్ కార్ప్స్‌లో అధికారిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని పారిస్ మిలిటరీ కాలేజీలో డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కోర్సు పూర్తి చేశారు. కాలిఫోర్నియా నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో డిఫెన్స్ కోర్సులో శిక్షణ పొందారు.
సైన్యం ఆధునీకరణలో కీలక పాత్ర
భారత సైన్యాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో ధీరజ్ సేథ్ కృషి ఎంతో ఉంది. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని స్ట్రాటజిక్ ప్లానింగ్, కేపబిలిటీ డెవలప్‌మెంట్ విభాగాల్లో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రక్షణ రంగ కొనుగోళ్లు, దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషించా రు.
సదరన్ కమాండ్ అధిపతిగా ఉన్న సమయంలో ఆర్మ్‌డ్ నిట్లలో డ్రోన్లను అనుసంధానించిన ఘనత ఆయనది. ‘శౌర్య స్క్వాడ్రన్’ ప్రయోగాన్నీ విజయవంతంగా అమలు చేసి యావత్ సైన్యా న్ని అబ్బురపరిచారు. సైన్యంలో ఆయ న విశేష సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ పురస్కారాలు లభించాయి.






