14 June, 2026 | 1:30 AM

కోకాపేట పోచమ్మ టెంపుల్ దగ్గర ప్రధాన రహదారి కబ్జా!

13-06-2026 11:42 PM
  1.  33 ఫీట్ల నక్ష రోడ్డును 15 ఫీట్లు ఆక్రమించి కడీలు పాతిన వైనం
  2. అధికారులు సర్వే చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలి

రాజేంద్రనగర్ జూన్ 13 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండల పరిధిలోని కోకాపేట గ్రామ  శివారులోని పోచమ్మ ఆలయం దగ్గర కొందరు వ్యక్తులు రోడ్డును ఆక్రమించారు. తమదే రోడ్డు స్థలం అంటూ రహదారికి అడ్డంగా కడీలు పాతారు.  గతంలో గ్రామపంచాయతీ నక్ష ఆధారంగా ఇక్కడ 33 ఫీట్ల ప్రధాన రహదారి ఉన్నది అది కాదని ఓ వ్యక్తి రోడ్డు వెంబడి  50 ఫీట్ల పొడవున 15 ఫీట్ల రోడ్డు స్థలంలో రోడ్డుకు అడ్డంగా ఖడీలు పాతి ఆయా కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కోకాపేట గ్రామస్తులు వాపోయారు.

ఫోనిక్స్ స్కూల్ నుండి గ్రీన్ యాడ్ వరకు ఉన్న ఈ నక్ష రోడ్డు ను కబ్జా చేయడం ఇంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఈ రోడ్డు వెంబడి కోకా పేటకు చెందిన 200 ఇండ్లు . గ్రీన్ స్పేస్ అపార్ట్మెంట్ కి చెందిన దాదాపు 50 విల్లా లో నివాసం ఉండేవారు ఈ రోడ్డు వెంబడి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు 33 ఫీట్ల రోడ్డును కబ్జా చేయడంతో పోచమ్మ ఆలయం దగ్గర రోడ్డు ఇరుకు గా మారి ఎంతో ఇబ్బందులు పడాల్సి  వస్తుందని ఆయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గండిపేట మండల రెవిన్యూ అధికారులు జిహెచ్‌ఎంసి నార్సింగి డిప్యూటీ  కమిషనర్ కార్యాలయ అధికారులు స్పందించి గతంలో ఉన్న నక్ష రోడ్డు ఆధారంగా రోడ్డును వేసి కబ్జా కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోకా పేట గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.