14 June, 2026 | 3:04 AM

ఓటు.. సీటు చోరీకి పాల్పడేది బీజేపీయే

14-06-2026 01:16 AM
  1. ఓటర్ జాబితా సవరణలో బీఎల్‌ఏలదే కీలక పాత్ర                                 
  2. ఇంటింటి సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి                                             
  3. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, జూన్ 13 (విజయక్రాంతి) : ఓటు, సీటు చోరీకి పాల్పడేది బీజేపీయే అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో శనివారం కాంగ్రెస్ బీఎల్‌ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొ ని మాట్లాడారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కాం గ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చా రు. బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో కాం గ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ సదస్సులో మి ర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సర్ పరిశీలకులు రామ్జీ, మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, డిప్యూటీ మేయర్ అహ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కాంగ్రె స్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూకూ రి రమేశ్, కాంగ్రెస్ పార్టీ కనగల్ మండలాధ్యక్షుడు గడ్డం అనుపమారెడ్డి, మాజీ జడ్పీ టీసీ వంగూరు లక్ష్మయ్య, బూత్ లెవెల్ ఏ జెంట్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బత్తాయి సాగులో నల్లగొండను ఆదర్శంగా నిలుపుతా

నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్ 2026 సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, ప్రస్తుతం 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మా రాల్సిన అవసరం ఉందని, వరిపైనే ఆధారపడకుండా బత్తాయి, ఇతర ఉద్యాన పంట లను సాగు చేయాలన్నారు.

పంట మార్పిడిపై దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం వి విధ పంటలు సాగుచేసే రైతులకు సహకారం అందిస్తున్నదన్నారు. ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర తోపాటు, 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్నధాన్యా న్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. బత్తాయికి పేరు ప్రఖ్యాతులు గాంచిన నల్లగొండ జిల్లా లో తిరిగి బత్తాయిని ఎక్కువ మొత్తంలో సాగు చేయాల్సిన అవసరం ఉందని, బత్తా యి ఆరోగ్యపరంగా మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఉద్యాన పంటల ప్రాముఖ్యత నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశా రు. హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతు లు, మార్కెటింగ్ ఎగుమతులు తదితర విషయాలపై చర్చిస్తామన్నారు. బత్తాయి సాగు లో కొత్తరకం వంగడాలు ప్రయోజనకరంగా ఉంటాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.

నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ పెట్టుబడితో పంటల సాగు తదితర అంశాలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,  డైరీ డెవలప్ మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డి. రాజిరెడ్డి, రైతు కమి షన్ సభ్యులు రామ్‌రెడ్డి, చెవిటి వెంకన్న, పావనిరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్, డీడీ అశోక్, సూర్యాపేట డీడీ నాగ య్య పాల్గొన్నారు.