14 June, 2026 | 1:30 AM

రేవంత్‌ది కుంభకోణాల ప్రభుత్వం

14-06-2026 12:20 AM
  1. గురుకులాల్లో రూ.3 వేల కోట్ల అవినీతి
  2. వ్యవస్థ మీద అవగాహనలేని మంత్రులకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు
  3. వాళ్లకు అంకెకు, సంఖ్యకు తేడా తెలియదు
  4. సీఎం రేవంత్‌రెడ్డి వెన్నుపోటులో రీసెర్చ్
  5. గురుకుల టెండర్లపై సిట్ విచారణ, విజిలెన్స్ దాడులు జరగాలి 
  6. బీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వరుస కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహారుద్దీన్ అసత్యాలు మాట్లాడారని, వాళ్ల కు అంకెకు, సంఖ్యకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ చక్క ర్లు కొడుతూ వెన్నుపోటు పొడవడంలో రీసెర్చ్ చేస్తున్నారని విమర్శించారు.

గురుకులాల్లో దాదాపు రూ.3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. గురుకులా ల టెండర్లను తక్షణమే రద్దుచేయాలని, సిట్ విచారణ, విజిలెన్స్ దాడులు జరగాలని డిమాండ్ చేశా రు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. గురుకులాల్లో కుంభకోణం గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడింది వాస్తవమని, తెలంగాణ సొమ్మును ఢిల్లీకి, ఇతరులకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా ఇతరుల జేబుల్లోకి పోకుండా, పిల్లలకు దక్కాలని పనిచేశామ ని గుర్తుచేశారు. ఆనాడు ఎవరైనా తప్పులు చేస్తే వెంటనే సస్పెండ్ చేసేవారని, జూన్ వస్తుందంటే జనవరిలోనే గుండెల్లో రైళ్లు పరుగెత్తేవన్నారు. పుస్తకాలు, బూట్లు, ట్రంక్ బాక్సు లు వంటి సౌకర్యాల గురించి అర్ధరాత్ర వరకు సమావేశాలు జరిగేవన్నారు. 3 నెలల్లో బిల్లులు కూడా క్లియర్ అయ్యేవని, విజిలెన్స్ అధికారులను పెట్టి నాణ్యత లోపించకుండా చూశామని తెలిపారు.

బొల్లారం, నాచారం, పాశమైలారం, కాటేదాన్‌లో ఉండే చిన్నిచిన్న పరిశ్రమలకు, ఎంఎస్‌ఎంఈలకే అవకాశాలు ఇచ్చి టెండర్లు దక్కేలే చూశామన్నారు. రేవంత్‌రెడ్డి మూటలు మోసి.. మోసి.. రైతులకు గన్నీ బ్యాగులు లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో జరిగింది రూ.687 కోట్ల కుంభకోణం కాదని, 2 నుంచి 3 వేల కోట్ల కుంభకో ణమ ని వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఒక్కో పాఠశాలలో చికెన్, మట న్, గుడ్లు, కూరగాయలు, బియ్యం వంటివి ఒక్కొక్కరికీ కాంట్రాక్టు ఇచ్చే వాళ్లమన్నారు.

ఈ విధంగా 10 వేల మంది కాంట్రాక్టర్లను తయా రు చేశామన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి, సెక్రటరీ అయిన మహిళా అధికారిణి, వేం నరేం దర్‌రెడ్డి కలిసి కుట్ర పన్ని ప్రాజెక్టు మానిటరిం గ్ యూనిట్ డాక్యుమెంటేషన్ తయారు చేశారని తెలిపారు. ‘తరచూ విషాహార ఘటనలు జరుగుతున్నాయి. పాత కాంట్రాక్టర్లే కారణం. అందుకే కాంట్రాక్టర్లను మార్చాలి.. తెలంగాణో ళ్లు వద్దు.. వీళ్లు నాణ్యమైన వస్తువులు ఇవ్వరు’ అంటూ తప్పుడు ప్రచారం చేశారని వివరించారు.

కేసీఆర్ హయాంలో 52 గ్రాముల గుడ్లు ఇస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సీ గ్రేడ్ ఇస్తూ రేటు మాత్రం రూ.7 పెట్టిందన్నా రు. ట్రంకు బాక్సులు, నోట్‌బుక్‌లు, షూ వంటి వస్తువులను ఎన్ని కొంటున్నారో చెబుతున్నా రు కానీ, ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ విలువ మాత్రం రాయడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో కార్పొరేట్ స్కూళ్లు వద్ద.. గురుకులాలే కావాల ని విద్యార్థులు వచ్చే వారని, కానీ ఇప్పుడేమో దోచుకోవడానికి ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తున్నారని ఆరోపించారు.

గతంలో మన తెలంగాణ నుంచే నోట్ బుక్స్ సేకరించేదని, కానీ ఇప్పుడు సంతన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, పీఈటీ డ్రెస్, ట్రాక్ సూట్; నైట్ డ్రెస్ మఫత్ ఇండస్ట్రీస్ గుజరాత్ నుంచి స్కూల్ బ్యాగ్స్, షూ టై క్షిప్రా ఎంటర్ ప్రైజెస్ నుంచి సేకరిస్తున్నారని వివరించారు. గతంలో ఇక్కడే ఉండే పేదలకు ఎంఎస్‌ఎంఈ కంపెనీలకు ఇచ్చేవాళ్లమన్నారు. టెస్కో వారి నుంచి, చేనేత కార్మికుల నుంచి, చర్లపల్లి, చంచల్‌గూడ జైలులో పనిచేసే కార్మికుల నుంచి సేకరించి విద్యార్థులకు ఇచ్చే వాళ్లమని గుర్తు చేశారు.

అజారుద్దీన్‌కు ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్ గురిం చి మాత్రమే తెలుసు అని, ఆయన మంత్రిగా స్టంప్ ఔట్ అయ్యారని ఎద్దేవా చేశారు. లిడ్‌క్యాప్ అనే సంస్థ చర్మకారులైన మాదిగల కోసం పెట్టిందని, కానీ ఇప్పుడు రమేష్ జైన్ అనే వ్యక్తికి తెలంగాణ లిడ్ క్యాప్‌ను ఏ విధం గా అప్పగించారని ప్రశ్నించారు. అప్లికేషన్ తీసుకునే కంపెనీకి రూ.300 కోట్ల టర్నోవర్ ఉండాలని ప్రభుత్వం అంటోందని, మన షూస్ అనే కంపెనీ పెట్టుకున్న మాదిగ యువకుడు అంత టర్నోవర్ ఎలా తెస్తాడని నిలదీ శారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా పట్టించుకోలేదని, రమేష్ జైన్ చర్మకారుడా?, చెప్పులు కుట్టేవాడా?, ఆయనకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో బంకర్ బెడ్ రూ.8 వేలు, డెస్క్‌లు రూ.8 వేలకు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు రూ.33 వేలు అని వెల్లడించారు.

టీఎస్ ఎండీసీ ఆస్పత్రుల్లో వాడే బెడ్స్ కూడా తెలంగాణ నుంచి సేకరించడం లేదని, తెలంగాణ వాళ్లు అంటే ఎందుకింత కోపం, చిన్న చూపు అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయినందుకు రేవంత్‌రెడ్డికి తెలంగాణ అంటే కోపమా అని నిలదీశారు.

రేవంత్‌రెడ్డి హిట్లర్ కన్నా ఘోరమైన చరిత్రహీనుడు

 రేవంత్‌రెడ్డి హిట్లర్ కన్నా ఘోరమైన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అజారుద్దీన్ ‘నాకేం తెలియదు.. ఆఫీసర్‌ను అడగండి’ అంటున్నారు.. పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు, పేదల వర్గాల నుంచి వచ్చిన సీతక్క ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఎమ్మెల్యేలు ‘మా వర్గాల వారికే టెండర్లు, కాంట్రాక్టులు ఇవ్వాలి’ అని గొడవ చేయాలన్నారు. జీఓ నంబర్ 17ను రద్దు చేయాలని కలెక్టర్ల వద్దకు వెళ్తే ఈ జీఓ ఏదో మాకు తెలియదు’ అని వారు అంటున్నారని చెప్పారు.

ఈ టెండర్ నిబంధనలు పార్క్ హయత్ లాంటి హోటల్లో రూపొందిం చారని, అందుకే కలెక్టర్లకు తెలియదని ఎద్దేవా చేశారు. గురుకులాల టెండర్లపై సిట్ విచారణ జరపాలని, విజిలెన్స్ దాడులు జరగాలని, రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం రమేష్‌కు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తే బెంగాల్‌లో టీఎంసీ ఎంపీలను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణేతరులకు ఇచ్చిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ ప్రజలకు టెండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.