దేశ రక్షణకు సన్న ద్ధంగా ఉండాలి
- సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సవాళ్లను ఎదుర్కోవాలి
- యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం
- కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సీజీపీ వేడుకలు
- మిరుమిట్లు గొలిపిన క్యాడెట్ల విన్యాసాలు
రంగారెడ్డి, జూన్ 13 (విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా యుద్ధ రంగంలో సాంకేతికత ప్రాధాన్యత సంతరించుకుందని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేం దుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చా రు.
శనివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)కు ఆయన ముఖ్య అతిథిగా, రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకు న్న ఫ్లైట్ క్యాడెట్లను విజయవంతంగా విధుల్లోకి ఆహ్వానిస్తూ గగనతల రక్షణలో భారత వాయుసేన (ఐఏఎఫ్) పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. క్యాడెట్లు పాసింగ్ అవు ట్ పరేడ్ నిర్వహించి, కేంద్ర మంత్రికి గౌరవ వందనం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
సమకాలీన ప్రపంచంలో యుద్ధ తంత్రా లు వేగంగా మారుతున్నాయని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. సైబర్ దాడులు, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అధికారులు నిరంతరం అందిపుచ్చుకోవాలని సూచించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, త్రివిధ దళాల సమన్వయంతోనే సమర్థవంతమైన రక్షణ సాధ్యమవు తుందని స్పష్టం చేశారు.
మిరుమిట్లు గొలిపిన విన్యాసాలు
ఈ వేడుకల్లో భాగంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ట్రెయినీలకు రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా వింగ్స్, బ్రెవెట్స్ అందజేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ ప్లాక్ అవార్డులను, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ స్వార్డ్ ఆఫ్ ఆనర్లను ప్రదానం చేశారు. పరేడ్ ముగింపులో వాయుసేన పైలట్లు చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
సుఖోయ్ ఎంకేఐ ఫైటర్ జెట్స్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్, సారంగ్ హెలికాప్టర్ బృందాలు ఆకాశంలో ప్రదర్శించిన విన్యాసాలు ఈ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, ఉత్తీర్ణులైన క్యాడెట్ల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొని యువ అధికారులను అభినందించారు.






