20 June, 2026 | 1:52 AM

విత్తన షాపులలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

19-06-2026 09:57 PM

విత్తన అమ్మకాలపై ప్రత్యేక నిఘ

కారేపల్లి,(విజయక్రాంతి): నకిలీ విత్తనాలు అరికట్టడం కోసం పోలీస్ వ్యవసాయ శాఖ సంయుక్త అధికారులతో ప్రభుత్వ ఏర్పాటుచేసిన మండల టాస్క్ ఫోర్స్ టీం శుక్రవారం కారేపల్లి మండలంలోని వివిధ విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. కారేపల్లి ఎస్సై బైరు గోపి, ఏవో బట్టు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో విత్తన దుకాణాల తనిఖీ చేసి విత్తనాల శాంపిల్స్ సేకరించారు. విత్తన స్టాక్ ను, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్ లను వారు పరిశీలించారు. తగిన పత్రాలు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ అధికారులు విత్తన దుకాణదారులను ఆదేశించారు. గ్రామాలలో తిరుగుతూ  విత్తనాలు అమ్మే వారి వివరాలు పోలీస్ శాఖ తెలియజేయాలని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.