డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి
భాజపా ఆధ్వర్యంలో ఏవోకి వినతి పత్రం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): డీఏపీ అసలు ధర సుమారు రూ.3000 ఉండగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో 1350 రూపాయలకు అందించడం జరుగుతుందని, కానీ ఎరువుల షాపుల వద్ద రైతులకు ఎమ్మార్పి కంటే 300 నుండి 400 ధరకు ఎక్కువగా విక్రయిస్తున్నారని,భాజాపా నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కొనతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి జావీద్ కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... డీఏపీ, 20-20-0-13, ఇతర ఎరువుల బస్తాపై ఉన్న ధరకు అమ్మకుండా, ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా రైతుల నెత్తిన భారాన్ని మోపడం జరుగుతుందని, ఎరువుల షాపులను తనిఖీ చేసి ఎమ్మార్పి ధరకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమoలో జిల్లా భాజపా కోశాధికారి తాళ్ల నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సంకల మద్ది సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏమి రెడ్డి శంకర్ రెడ్డి, కొప్పుల లక్ష్మీనారాయణ, జూలూరి అశోక్, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బుస్సా విమల తదితరులు పాల్గొన్నారు.






