calender_icon.png 2 January, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురునానక్ కాలేజీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

02-01-2026 01:30:17 AM

  1. మృతుడు ఫస్టియర్ చదువుతున్న రాము

గత ఏడాది మే నెలలోనూ ఇదే కాలేజీలో విద్యార్థిని బలవన్మరణం

వరుస ఘటనలతో క్యాంపస్‌లో కలకలం

విద్యార్థుల్లో ఆందోళన

హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం వచ్చిన ఓ విద్యార్థి అర్థాంతరంగా తనువు చాలించాడు. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ హాస్టల్ గదిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాము 20 ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గురువారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూడటం తో తోటి విద్యార్థులు భయాందోళనకు గుర య్యారు. వివరాల్లోకి వెళితే.. రాము బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం తన గదిలో ఎవరూ లేని సమయంలో రాము ఉరేసుకుని కనిపించాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.