11 April, 2026 | 4:00 AM

బీసీ రక్షణ చట్టం తీసుకురావాలి

11-04-2026 01:59 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి పాలనలో బీసీలపై అగ్రకులాల దౌర్జన్యాలు పెరిగాయని, వీటిని వెంటనే అరికట్టకపోతే బీసీలు తిరుగుబాటు చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.

ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ బీసీలపై దౌర్జన్యాలు- ఆకృత్యాలు అరికట్టాలంటే ‘బీసీ రక్షణ చట్టం‘ తేవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకొని వెంటనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరిపే చట్టం తీసుకురావాలని కోరారు.

తాజాగా వారం రోజుల నుంచి వికారాబాద్ జిల్లాలో నవాబ్ పేట మండలం దాతపూర్-పులి మామిడి గ్రామాల్లో గొల్ల కురమలపై రెడ్లు గ్రూప్ తగాదాలు సృష్టించి దౌర్జన్యం దాడులు చేస్తున్నారన్నారు. భూమి తగాదా లు సృష్టించి దౌర్జన్యం చేస్తున్నారన్నారు. అధికారులకు బాదితులు ఫిర్యాదు చేసిన పట్టిం చుకోవడం లేదన్నారు. ప్రభుత్వం బీసీల 42% రిజర్వేషన్ వంట వాగ్దానాలను అమ లు చేస్తున్నట్లుగానే, ఈ చట్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్, రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్, కన్వీనర్ మోడీ రాందేవ్ సమన్వయం చేశారు.