భూ నిర్వాసితులతో మాట్లాడిన బాన్సువాడ సబ్ కలెక్టర్
11-04-2026 02:01 AM
నిజాంసాగర్ ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం నాడు వడ్డేపల్లి గ్రామపంచాయతీలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో రైతులతో చర్చలు జరిపారు.
భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున తొందరగా సహాయం అందెందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రైతులు ఎవరు కూడా అదే పడకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నీటి పాదశాఖ ఈఈ సోలోమన్, తహసిల్దార్ భుజంగరావు, గిర్దావర్ సాయిలు, స్థానిక సర్పంచ్ బోజ్జా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.




