31 July, 2026 | 5:03 AM

మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపీట

25-08-2024 12:28 AM

టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి 

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24 (విజయక్రాంతి): తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాలయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధిపై శనివారం మున్సిపల్ చైర్మన్ మల్‌రెడ్డి అనురాధరాంరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు నిర్మించే విధంగా నిధులు రాబడుతున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరితధనరాజ్, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.