19న అఖిలపక్ష భేటీ
పార్లమెంట్ సమావేశాలకు ముందు అజెండాపై చర్చ
కీలక బిల్లులు ఆమోదింపచేసుకునే ప్రయత్నంలో కేంద్రం
నీట్, నిరుద్యోగం, చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై నిలదీతకు ప్రతిపక్షాలు రెఢీ
న్యూఢిల్లీ, జూలై 12 (విజయక్రాంతి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు జూలై 19న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆదివారం పార్లమెంట్ వ్యవహారా శాల శాఖ ప్రకటించింది. ఈ సమావేశంలో ప్రభుత్వం శాసనసరమైన అజెండాను వివరించనుండగా, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే సమాలోచనల్లో ఉన్నారు.
సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులకు సంబంధించి ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించనుంది. చర్చ చేపట్టే అవకాశం ఉంది. కాగా టీఎంసీ ఎంపీలు ఇతర పార్టీలో విలీనమై తమకు లోక్‌సభలో ప్రత్యేక స్థానం కావాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మరో ముగ్గురు రాజ్యసభ పదవులకు రాజీనామాలు సమర్పించి బీజేపీలో చేరారు. యూబీటీలోని లోక్‌సభ ఆరుగురు ఎంపీలు చేరారు.
రాజ్యసభలోని ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో చేరారు. పార్టీలను వీడడం పట్ల కూడా ఎంపీలపై వేటు వేయాలని ప్రతిపక్షాలు గందరగో ళం సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు పరీక్షా పత్రాలకు సంబంధించిన పేపర్లు లీక్ కావడం, కేంద్ర విద్యాశా ఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్, వాంగ్‌చుక్, కాక్రోచ్ పార్టీ ధర్నాలు, ఆందోళనలు, ముఖ్యంగా అయోధ్య రామ మంది రం విరాళాల చోరీ, నిరుద్యోగం, పెట్రోల్- డీజిల్, గ్యాస్ ధరల్లో పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.
ఇంకోవైపు ఇథనాల్, తీవ్రమైన నేరాలకు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంశాలు కూడా చర్చకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఎఫ్‌సీఆర్, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్, యాంటీడోపింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే ఆర్డినెన్స్, వేతనాల కేంద్ర నియామావళి, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ లాంటి బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. కాగా జూలై 20న మొదలై ఆగస్ట్ 13వరకు సమావేశాలు కొనసాగుతాయి.






