టీఆర్పీ మహిళా విభాగాల నియామకం
- యాదాద్రి జిల్లా అధ్యక్షురాలిగా బుద్దుల సునీత
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కర్రు పావని
హైదరాబాద్, జూలై 12(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజ కీలక నియామకాలు చేపట్టారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బుద్ధుల సునీతను, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కర్రు పావనిని నియమించారు. ఈ నియామక పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పార్టీ బలోపేతం, మహిళల రాజకీయ సాధికారత, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ విస్తరణ కోసం నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. నూతనంగా నియమితులైన బుద్ధుల సునీత, కర్రు పావని మాట్లాడుతూ తమపై పార్టీ నాయకత్వం ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పసుల ప్రసన్న కుమారి పాల్గొన్నారు.






