ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వ్యక్తి?
టెహ్రాన్, జూలై 12 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఓ ముసుగు మనిషి పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతను ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఆ వ్యక్తి గురించిన చర్చలు వైరల్‌గా మారాయి. ముసుగులో వచ్చిన వ్యక్తి ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ అయి ఉండొచ్చనే ప్రచారం కొనసాగుతుంది.
తండ్రి అంత్యక్రియలకు రహాస్యంగా హాజరై ఉంటారని అందరూ భావిస్తున్నారు. ముఖానికి నల్లటి మాస్కు ధరించిన ఆ వ్యక్తి ఖమేనీ కుటుంబంలోని పసిబిడ్డ మృతదేహాం బాక్సును మోశాడు. కాగా ఈ విషయంలో అంతర్జాతీయ పత్రికలు మరోవిధంగా భావిస్తున్నాయి. ముసుగులో ఉన్న వ్యక్తి ఖమేనీ పెద్ద మనవడు మహమ్మద్ జావెద్ ఖమేనీగా పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 28న దాడుల్లో జావెద్ శరీరం కాలిపోయిందని అప్పటి నుంచి తన శరీరాన్ని కప్పి ఉంచుతున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఖమేనీ పెద్ద కుమారుడు ముస్తాఫా సంతానమే ఈ జావెద్. భిన్న ప్రచారాలపై ఇరాన్ వైపు నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.






