12 July, 2026 | 8:28 AM

బోగస్‌గా మిగిలిన పంట బోనస్

10-06-2024 01:34 AM
  • విత్తనాల కొరతపై రాష్ట్రప్రభుత్వ దృష్టే లేదు..
  • ఆయిల్‌పాం సాగుపై సర్కార్ చిన్నచూపు
  • మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట, జూన్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న పంట బోనస్ బోగస్‌గా మిగిలిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెన పల్లికి చెందిన రైతులు ఆదివారం ఆయిల్ పాం తోటల్లో మొదటి కోతలు ప్రారంభించా రు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి  సీజన్‌కు ముందే పంట పెట్టుబడి అందించాలని డిమాండ్ చేశారు. ఆయిల్ పాం సాగును రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు.

ఆయిల్ పాం రైతులకు సర్కార్ ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఆదర్శ రైతు నాగేందర్ ఆయిల్ పాం తోటల సాగు ప్రారంభించినప్పుడు తానే మొదట మొక్క నాటానని, ఇప్పుడు అదే తోటలు తాను కోతలు ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట నియోజకవర్గం ఆయిల్ పాం హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్‌పాం రైతులు అంతర పంటగా కో కో పండించాలని సూచించారు. పర్యటనలో నాయకులు సారయ్య, రాధాకృష్ణ శర్మ, సోమిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దువ్వల మల్లయ్య