calender_icon.png 3 December, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచిలో నాటు బాంబు.. కుక్క కొరకడంతో పేలుడు

03-12-2025 03:13:43 PM

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాట బాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని దుండగులు ఓ నల్ల సంచిలో బాంబు అమర్చి వెళ్లారు. అటుగా వెళ్లిన ఓ కుక్క తిన్నే పదార్థం అనుకోని కొరకడంతో బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా బాంబు పేలి భారీగా శబ్ధం రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై రైల్వే స్టేషన్ పరిసరాల్లో డాగ్స్ స్క్వాడ్ తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ నాటు బాంబు అమర్చడం వెనుక ఎదైన కుట్ర దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.