1 June, 2026 | 2:24 AM

కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు

01-06-2026 01:47 AM

బోధన్:మే 31 (విజయక్రాంతి): రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నీటిలో తెప్పలు వదులుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు.. నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయంలో శివుని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.