కోదాడ మీదుగా బుల్లెట్‌ట్రైన్ ఏర్పాటు చేయాలి
స్పష్టం చేసిన అఖిలపక్ష నాయకులు
కోదాడ ఆగస్టు 24: కోదాడ మీదుగా హైదరాబాద్.. అమరావతి.. చెన్నై ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగాలి.. తొలుత ప్రతిపాదన ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలో చౌటుప్పల్ సూర్యాపేట కోదాడ మీద గా బుల్లెట్ ట్రైన్ వెళ్లాల్సిందేనని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సామూహిక సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
65 జాతీయ రహదారి పై ప్రమాదాలతో వందల మంది ప్రాణాలు కోల్పోయారని ట్రైన్ తో ఈ ఇబ్బంది కలుగుతుందని, దీంతోపాటు పారిశ్రామికంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందేందుకు రైల్వే లైన్ ఉపకరిస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బిజెపి ఎమ్మార్పీఎస్ నాయకులు ములకలపల్లి రాములు బెజవాడ వెంకటేశ్వర్లు మేకల శ్రీనివాస్ వెంపటి వెంకటేశ్వరరావు చింతలపాటి శ్రీనివాసరావు కనగాల నారాయణ ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి రాజు, సత్య బాబు పిల్లుట్ల శ్రీనివాస్ కరీముల్లా బాబా ముత్యాలు హుస్సేన్ రామ నరసయ్య కోటయ్య నరసింహారావు పార్టీల నాయకులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ స్వచ్ఛంద సంస్థల కుల సంఘాల బాధ్యులు పట్టణ పౌరులు పాల్గొన్నారు.






