13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కారం

27-03-2026 12:11 AM

టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ’ (ఐఎఫ్‌ఎఫ్‌డీ) నుంచి ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (జీవన సాఫల్య పురస్కారం)ను అందుకున్నారు. బాలకృష్ణ దశాబ్దాలుగా సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కింది. బుధవారం సాయ్రంతం దేశ రాజధానిలోని భారత్ మండపంలో ప్రారంభమైన ఈ ఐఎఫ్‌ఎఫ్‌డీ-2026 వేడుకల్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

ఇదే వేదికపై అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరపున కుటుంబసభ్యులు)ను కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా చేతుల మీదుగా వీరంతా అవార్డులు అందుకొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.

ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలనచిత్ర ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషా చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఇక బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించడం పట్ల తెలుగు ఫిలం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది.