calender_icon.png 3 February, 2026 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సు

29-07-2024 12:17:20 AM

రైతు మృతి

కామారెడ్డి, జూలై 28(విజయక్రాంతి): బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో వాహనదారుడు మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా తుజాల్‌పూర్‌కి చెందిన లక్ష్మయ్య (56)ఆదివారం తుజాల్‌పూర్ నుంచి ఆకారం వైపు బైక్‌పై వెళ్తున్నాడు.  బీబీపేట్ వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన బస్సు  బైక్‌ను ఢీ కొనడంతో లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మయ్య మృతిచెందినట్లు బీబీపేట పోలీసులు తెలిపారు.