13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నిఖత్ జరీన్, లవ్లీనాలకు బై

30-03-2026 01:31 AM

ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్

మంగోలియా, మార్చి 29 : ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పోరా టం సోమవారం నుంచి మొదలుకాబోతోం ది. 20 మందితో కూడిన భారత బాక్సింగ్ జట్టుపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ పోటీలకు సంబంధించిన డ్రా వివరాల ను ప్రకటించారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్,మరో స్టార్ బాక్సర్ లవ్లీనాలకు తొలి మ్యాచ్‌లలో బై లభించింది. వీరిద్దరితో పాటు జాస్మిన్, అంకుషిత, అరుంధతి చౌద రి, ఆల్ఫియా పఠాన్ కూడా బై కారణంగా ముందంజ వేశారు.

మహిళల విభాగం 54 కేజీల కేటగిరీలో ప్రీతి పవార్ కజకిస్థాన్‌కు చెందిన ఎలీనా బజారోవాతో తలపడనుండగా.. 60 కేజీల కేటగిరీలో ప్రియా,  రిమ్మా వోలాసెంకోని ఢీకొననుంది. ఇదే కేటగిరీలో పూజ రాణి కూడా కజకిస్థాన్ బాక్సర్ ర్యాబెట్స్‌తో తలపడుతుంది. అటు పురుషువ విభాగంలో విశ్వనాథ్ సురేశ్, కజకిస్థాన్ బాక్సర్ ఎర్గోషెవ్‌తోనూ, జాదుమణి సింగ్ జపాన్‌కు చెందిన టాప్ సీడ్ యమగుచితోనూ తలపడనున్నారు.