13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మేజర్ క్రికెట్ లీగ్‌లో అశ్విన్

30-03-2026 01:32 AM

శాన్‌ఫ్రాన్సిస్కో, మార్చి 29 : భారత క్రి కెట్ జట్టు మాజీ స్పి న్నర్ రవిచంద్రన్ అశ్వి న్ విదేశీ క్రికెట్ లీగ్స్‌పై ఫోకస్ పెట్టా డు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అశ్విన్ విదేశీ లీగ్స్ లో ఆడేందుకు ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఈ దిగ్గజ స్పిన్న ర్ మేజర్ క్రికెట్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఆ లీగ్‌లో శాన్‌ఫ్రాన్సి స్కో యూని కార్న్స్ జట్టు అశ్విన్‌తో ఒప్పం దం కుదుర్చుకుంది. దీంతో మేజర్ క్రికెట్ లీగ్‌లో ఆడబోతున్న తొలి భారత క్రికెటర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు.

గతంలో బిగ్‌బాష్ లీగ్ తరపున ఆడాల్సి ఉన్నప్పటకీ గాయం కారణంగా చివ రి నిమిషంలో తప్పుకున్నాడు. అపారమైన అనుభవం ఉన్న అశ్విన్ లాంటి స్పిన్నర్ త మ జట్టులోకి రావడంపై యూనికార్న్స్ ఫ్రాంచైజీ సంతోషం వ్యక్తం చేసింది. అతని స్పిన్ నైపుణ్యం టోర్నీలో తమ జట్టుకు ఎం తో ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు ఎంఎల్‌సీ లీగ్‌లో అడుగుపెడుతున్న తొలి భారత క్రికెటర్‌గా నిలవడం చాలా గొ ప్పగా ఉందని అశ్విన్ వ్యాఖ్యానించాడు.