27 April, 2026 | 4:04 AM

దంపతులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

09-12-2024 07:17 PM

రామాయంపేట: వ్యవసాయ పొలం వద్దకు పనుల నిమిత్తం కొరకు నడుచుకుంటూ వెళుతున్న దంపతులను అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగ్ మండల కేంద్రంలో సోమవారం నాడు చోటుచేసుకుంది. నార్సింగ్ ఎస్సై మొహమ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... నార్సింగ్ మండలానికి చెందిన వార్తపు లక్ష్మి (40) భర్త నాగరాజుతో కలిసి నర్సింగ్ గ్రామ శివారులో ఉన్న పొలానికి నడుచుకుంటూ వెళుతున్న దంపతులను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు డ్రైవర్ ఆజాగ్రత్తతో నడపడంతో దంపతులను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వట్టెపు లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా భర్త నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు గాయాల పాలైన నాగరాజును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న తాహసిల్దార్ షేక్ కరీం పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీ మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.