27 April, 2026 | 2:16 AM

మావోయిస్ట్ బబ్బేర రవి జన జీవన స్రవంతిలో కలవాలి

09-12-2024 07:08 PM

బెల్లంపల్లి ఏసీపి రవికుమార్...

మందమర్రి (విజయక్రాంతి): మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిమర్రి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు బబ్బెర రవి ఇంటికి వెళ్లి ఆయన తల్లి లక్ష్మిని కలిసి ఆమె ఆరోగ్య స్థితిగతిని అడిగి తెలుసుకుని బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందచేశారు. గత 24 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె కుమారుడిని లొంగిపోయేలా నచ్చజెప్పాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాధ్యం కాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్ప, సాధించింది ఏమి లేదన్నారు. జన జీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని, అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన చికిత్సనందిస్తామని హామీ ఇచ్చారు. ఏలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కె శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్  పాల్గొన్నారు.