13 July, 2026 | 9:32 PM

Breaking News

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •  

వెంకటేశ్–అనిల్ రావిపూడి ‘వెంకీ 5’లో కీర్తి సురేశ్.. మరో హీరోయిన్ ఎవరు?

24-03-2026 01:25 AM

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘వెంకీ 5’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక పూర్తయింది. ఇప్పటికే కీర్తి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ విషయమై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఈ సినిమాలో నటించే మరో హీరోయిన్ ముచ్చట కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కయాదు లోహర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కయాదు ఎంపిక దాదాపు ఖాయమైందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.