10 August, 2026 | 3:48 AM

అక్షర కుటుంబానికి అండగా నిలిచిన ఆత్మీయబంధం

10-08-2026 02:06 AM

భీమదేవరపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఎలిగేటి ప్రవళికరమేష్ దంపతుల కుమార్తె అక్షర ఇటీవల మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ కష్ట సమయంలో ప్రవళికతో కలిసి చదువుకున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు.

అక్షర కుటుంబాన్ని పరామర్శించిన పూర్వ విద్యార్థులు రూ.17 వేల ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. అనంతరం అక్షర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చదువుకున్న రోజుల బంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆపద సమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం ద్వారా తమ ఆత్మీయతను చాటుకున్నారు.