రేపు పటాన్‌చెరువులో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం
జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
సంగారెడ్డి, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజే ఐజేయూ) పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు రామచంద్రాపూర్లోని లక్ష్మీ గార్డెన్స్లో జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఆర్.అనిల్ కుమార్ ఆదివారం తెలిపారు.
వర్కింగ్ జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా యూనియన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం, హెల్త్ కార్డుల విషయం కూడా చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇంకా మిగిలిపోయిన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె పైసల్ తో పాటు జాతీయ సభ్యులు, రాష్ట్ర సభ్యులు, రాష్ట్ర కమిటీ నాయకులు హాజరవుతారని తెలిపారు. జిల్లా కమిటీ నాయకులు, ఈసీ సభ్యులు, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, ప్రెస్ క్లబ్ల అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు హాజరుకావాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నందున ప్రతి ఒక్కరు సకాలంలో హాజరు కావాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.






