13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఉపాధ్యాయుని నియమించి.. జీతం చెల్లించి..

27-03-2026 12:00 AM

ఉదారాతను చాటుకున్న వైస్ చైర్మన్

మొయినాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): హిమాయత్నగర్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం మొయినాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఆరు నెలలుగా పాఠశాలలో గణితం  టీచర్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.ఈవిషయాన్ని గమనించిన గరుగు రాజు, జీ ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా మహేందర్ అనే ప్రైవేట్ టీచర్ను నియమించారు.

సదరు టీచర్కు తన సొంత డబ్బులతో జీతాన్ని అందజేసి, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూశారు.విద్యార్థులే దేశ భవిష్యత్తుకు దిక్సూచి.. వారి ఎదుగుదలకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అని ఆయన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, హెచ్‌ఎం జులేక సుల్తానా, ఉపాధ్యాయులు మరియు ఎస్‌ఎంసి సభ్యులు పాల్గొన్నారు.